ఒకే చిత్రంలో మూడు తరాలు
08-06-2026 12:36 AM
చిన్నంబావి, జూన్ 7: ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యతను పెంచుతూ బూజల కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.మండల పరిధిలోని వెలగొండ గ్రామానికి చెందిన కీర్తి శేషులు బూజల అక్కి రెడ్డి, నరసమ్మ దంపతుల కుటుంబానికి చెందిన మూడు తరాల పిల్లలు వారి కుటుంబీకుల గ్రామమైన వెల్టూర్ లో 103 మంది కుటుంబ సభ్యులు ఒకే దగ్గర చేరి రెండు రోజుల పాటు సరదాగా గడిపారు.ప్రస్తుత బిజీ జీవితంలో దూరం అవుతున్న బంధుత్వాలను దగ్గర చేయడానికి ఇటువంటి సమావేశాలు ఎంతో అవసరం. ఈ సమావేశం ద్వారా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడి, మధురమైన జ్ఞాపకాలు పదిలపడతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.






