8 June, 2026 | 1:58 AM

ఖరీజు ఖాతా భూములపై హక్కులు కల్పించాలి

08-06-2026 12:38 AM

వెల్దండ, జూన్ 7: మండల పరిధిలోని చెదురుపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఖరీజు ఖాతా భూములపై పూర్తి హక్కులు కల్పించాలని రైతులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిను కోరారు. రైతుల వివరాల ప్రకారం, 104 మంది రైతులు ఎన్నో ఏళ్ల క్రితం సుమారు 260 ఎకరాల భూమిని భూస్వాముల నుంచి కొనుగోలు చేసి పట్టాలు పొందారు. అయితే ఆ భూములు మార్ట్గేజ్ చేయబడినవిగా, ఖరీజు ఖాతా భూములుగా నమోదై ఉన్నాయని అధికారులు పేర్కొనడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో బ్యాంకు రుణాలు, , రైతు భరోసా ప్రయోజనాలు అందకపోవడం, భూముల క్రయవిక్రయాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాకట్టు రుణాలను పూర్తిగా చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఖరీజు ఖాతా భూములపై సర్వహక్కులు కల్పించి, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.