8 June, 2026 | 2:57 AM

మహేంద్రహిల్స్ భూవివాదంపై ముప్పు ఏళ్లుగా పోరాటం

08-06-2026 12:35 AM
  1. గద్దం ఏబెల్ అండ్ అసోసియేట్స్ లా ఫర్మ్
  2. నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్
  3. తేలని నవాబుల ఆస్తుల హక్కులు

సికింద్రాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అత్యంత ఖరీదైన మహేంద్ర హిల్స్ భూములు తాజాగా వివాదానికి కేంద్రబిందువుగా మారాయి అన్ని గడ్డం ఏబిల్ అన్నారు. బలం రాయి లీ ప్యాలెస్ లో ఆదివారం నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్ సభ్యులు తో కలిసి అడ్వకేట్ గడ్డం ఏబిల్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటోన్మెంట్, పైగా భూములు అంశాలపై నాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నవ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్  చేశారు.

నవాబుల ఆస్తుల హక్కులు అసలు మారేడుపల్లి విలేజ్ నుంచి మహేంద్ర హిల్స్ ఎలా విడిపోయింది? ఎలాంటి జీపీ అనుమతులు లేకుండానే సొసైటీ పేరుతో కాలనీలు ఎలా వెలిశాయో అధికారులు సమాధానం చెప్పాలని నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వం ని డిమాండ్ చేశారు.1950 నాటి సిఎస్ -13,సిఎస్ -14 రికార్డుల ప్రకారం తోకట్ట, పరిధిలోని సర్వే నెంబర్లు 157/1, 229, 232, 254 వంటి భూములు అస్మామాన్ జాహి,పైగా ఫ్యామిలీ, సాలార్జంగ్ నవాబుల సొంత ఆస్తులు.

కానీ, 1982-83 కాలంలో మహేంద్ర హిల్స్ సొసైటీ పేరుతో ఇక్కడి భూములు అక్రమంగా చేతులు మారాయని బాధితులు ఆరోపించారు.తోకట్ట 157/1 సర్వే నెంబర్లో జరుగుతున్న పనులకు, మనోవికాస్ నగర్ 8 ఎకరాల పట్టాలకు కంటోన్మెంట్ బోర్డు ఎలా అనుమతులు ఇచ్చిందనేది సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిఎల్‌ఆర్ వివాదంలో... అధికారుల కుమ్మక్కు అయ్యారని ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సొంత భూములు లేవని, కంటోన్మెంట్ అధికారులు చూపిస్తున్న జనరల్ ల్యాండ్ రికారడ్స్ కు చట్టబద్ధత లేదని బాధితులు ఆరోపించారు.

ఈ 30 ఏళ్ల పోరాటంలో కొందరు మధ్యవర్తులు బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని,కబ్జాదారుల తో బ్యూరోక్రాట్లు చేతులు కలిపారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రికార్డులు సీసీఎల్‌ఏ పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు.న్యాయం కోసం ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వహణాధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్,హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ,భారతరక్షణ శాఖ కార్యదర్శి,డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్,తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కి గద్దం ఏబెల్ అండ్ అసోసియేట్స్ లా ఫర్మ్ ద్వారా నోటీసులు ఇచ్చామని, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల పక్షమా లేక కబ్జాదారుల పక్షమా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కోర్టుల్లో ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించకపోవడంతో, ఈ భూ కుంభకోణంపై విచారణ జరపాలని పైగా ఫ్యామిలీ ఇప్పుడు సీబీఐ ని ఆశ్రయించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భూ సమస్యను పరిష్కరించాలని అసలైన వారసులు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో అడ్వకేట్ గద్దం ఏబెల్,నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఎండి అమీర్ అజీజ్ ఖాన్, జకీర్ హుస్సేనీయా, సయ్యద్ అహ్మద్, సైక్లుద్దీన్ హాసన్ అబ్దుల్ గఫార్ అస్లాం, సయ్యద్ సాహెబ్ ఉద్దీన్, మహమ్మద్ పైజాన్ ఖాన్, రఫీస్ మహమ్మద్, అక్రమ్ సయ్యద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.