calender_icon.png 9 February, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో మూడు మృతదేహాలు

09-02-2026 02:24:02 AM

ఢిల్లీలో కలకలం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి ౮: ఢిల్లీలోని పీరాగడి ఫ్లైఓవర్‌పై ఆదివారం సాయంత్రం ఓ ఆగి ఉన్న కారులో స్థానికులు మూడు మృతదేహాలు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కారు లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతులను రణధీర్ సింగ్ (60), లక్ష్మీదేవి (40), శివ నరేశ్‌సింగ్ (47)గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఢిల్లీలోని బాప్రోలా ప్రాంతానికి చెందిన వారని నిర్ధారించారు.

కారు లోపల వారు ఎలాంటి ఘర్షణ జరిగిన ఆనవాళ్లు గానీ, మృతదేహాలపై గాయా లు గానీ గుర్తించలేదు. ముగ్గురూ విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫారెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ఫ్లైఓవర్ పరిసరాల్లోని సీసీ టీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ కారు ఎప్పుడు అక్కడికి వచ్చింది? కారును ఎవరు నడిపారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.