గెలిస్తేనే నిలుస్తారు
- ఆసీస్‌తో భారత్ కీలక పోరు
- మహిళల టీ20 వరల్డ్ కప్
లండన్, జూన్ 27 : మహిళల టీ20 ప్ర పంచకప్‌లో భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. నిజానికి గ్రూప్ ఏ నుంచి ఇం కా ఏ జట్టు కూడా సెమీస్ చేరలేదు. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు నిష్క్రమించగా.. ఇక రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు రేసులో ఉన్నా యి. ఈ టోర్నీలో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక దాంట్లో మాత్ర మే ఓడి, మూడింట్లో నెగ్గింది. అయినప్పటికీ బెర్త్ కన్ఫర్మ్ కాలేదు. సెమీ ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు కీలకంగా మారిం ది. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకూడదంటే ఆసీస్‌పై భారత్ గెలవాల్సిందే.
ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్ 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రూప్ దశ లో తమ చివరి మ్యాచ్ భారత్‌తో ఆడా ల్సి ఉంది. అయితే నెట్న్‌ర్రేట్ +4.724 భారీ గా ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
భారత్, సౌతాఫ్రికాకు సమానంగా 6 పా యింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్‌తో రెండో స్థానంలో, సౌతాఫ్రికా (+0.734) మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో ఉంది. సమిష్టిగా రాణిస్తే కంగారూలను ఓడించడం పెద్ద కష్టం కాదు. బ్యాటింగ్‌లో షెఫాలీతో పాటు స్మృతి, హర్మ న్ ప్రీత్, రిఛా ఘోష్, జెమీమా కీలకం. బౌలింగ్‌లో శ్రీచరణి, దీప్తి శర్మ స్పిన్ విభాగంలో రాణిస్తున్నారు. పేస్ ఎటాక్‌లో రేణు కాసింగ్ ఠాకూర్ ఫామ్‌లోకి వచ్చింది.






