సమం చేస్తారా... సమర్పిస్తారా ?
టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ ఛాంపియన్స్... ఐపీఎల్‌లో దుమ్మురేపే టీ20 హిట్టర్స్... ఇంకేముంది ఐర్లాండ్‌పై సిరీస్ ఏక పక్షమే..ఇదీ ఈ టూర్‌కు ముందు భారత్ జట్టు గురించి వినిపించిన మాట.. కట్ చేస్తే తొలి టీ20లో అనూహ్య ఓటమి.. వెరసి ఒక్కసారిగా టీమిండియాకు బిగ్ షాక్. ఇప్పుడు సిరీస్ చేజారకుండా సమం చేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఒత్తిడి మధ్య భారత్ రెండో టీ20కి రెడీ అయింది.
- ఐర్లాండ్‌తో నేడు రెండో టీ20
- తుది జట్టులో మార్పులు
- సిరీస్‌పై కన్నేసిన ఐరిష్ టీం
బెల్ ఫాస్ట్, జూన్ 27 : ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభిం చింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ లో ఇలాంటి పరాజయాన్ని ఎవ్వరూ ఊహించలేదు. అది కూడా పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం ఫ్యా న్స్‌కు ఇప్పటికీ షాకే. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు సారథిగా ఇది అత్యంత అవమానకర పరిస్థితి. ఐర్లాండ్ 34 పరుగుల తేడా తో భారత్‌ను ఓడించి సరికొత్త చరిత్రను సృ ష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్ కు ఇదే తొలి విజయం.
ఈ ఘోర పరాజ యం నేపథ్యంలో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘాటు విమర్శల మధ్య టీ మిండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి టీ20 పరాజయం నేప థ్యంలో భారత తుది జట్టులో పలు మార్పు లు జరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా దా రుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడనుంది. అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేయవచ్చు. ప్రసిధ్ కృష్ణ పేలవ బౌలింగ్‌తోనే టీమిండియా ఓటమిపాలైంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిధ్ కృష్ణ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వి కెట్ కూడా తీయలేకపోయాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా సత్తా చాటినా.. ప్రసిధ్ కృష్ణ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన వా షింగ్టన్ సుందర్ తీవ్రంగా నిరాశపర్చాడు.
సుందర్‌ను తప్పిస్తే రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్ విభాగం కూడా పూ ర్తిగా చేతులెత్తేసింది. అభిషేక్ శర్మ మినహా అంతా విఫలమయ్యారు. ఏడుగురు బ్యాట ర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన సంజూ శాంసన్, ఇ షాన్ కిషన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అస్స లు క్రీజులో నిలవలేకపోయారు. సంజూ వి ఫలమైన నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. అయితే సూర్యవంశీ విషయంలో కోచ్ గంభీర్ తొందరపడడం లేదు.
బుడ్డోడి కోసం ఓపెనింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదని తొలి మ్యాచ్‌కు ముందే హింట్ ఇచ్చాడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం లేవనుకుంటే మరోసారి వైభవ్ సూర్యవంశీ బెంచీకే పరిమితం కావచ్చు. ఇప్పటికే ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోం ది. మిగతా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు. మరోవైపు తొలి టీ20లో స మిష్టిగా రాణించిన ఐర్లాండ్ అదే ఉత్సాహం తో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉం డడంతో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.
తుది జట్లు అంచనా
భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్
ఐర్లాండ్ : రాస్ అడైర్, స్టీఫెన్, టక్కర్(కెప్టెన్), హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, డెలెనీ, డాక్రెల్, మాథ్యూ, మెక్కార్త్, గావిన్ హోయె, రుబెన్ విల్సన్






