2 May, 2026 | 9:28 PM

Breaking News

మాదకద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకించాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలి   •   ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •  

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ కుటుంబానికి పాకిస్థాన్‌తో లింకులు!

09-02-2026 02:17 AM

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు  

గౌహతి, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌఖీ ర్ షేక్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఏజెంట్ 2010--13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచ వ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు.

ఆదివారం గువాహటిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ’ పాకిస్థానీ ఏజెంట్ అలీతో గౌరవ్ గొగొయ్, ఆయన సతీమణి, బ్రిటన్ పౌరురాలైన ఎలిజబెత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2011లో ఆమె అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడ పాక్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఆ తర్వాత భారత్‌కు బదిలీ చేసింది. ఆమె జీతాన్ని అలీ చెల్లించాడు. 

ఎలిజబెత్ భారత్‌లోని ఒక సంస్థలో పనిచేస్తూ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్‌కు చేరవేశారు. ఆమె భారత్‌లోని రెండు సంస్థల్లో పనిచేస్తున్న సమయంలో తొమ్మిది సార్లు పాక్‌కు వెళ్లింది’ అని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పాకిస్థాన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందాలతో కలిసి అలీ తౌఖీర్ షేక్, భారత పర్యటనకు వచ్చేవాడని చెప్పారు. ఎంపీ గౌరవ్ గోగోయ్, కొంతమంది యువకులను పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి తీసుకెళ్తున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఒక విధంగా గోగోయ్ పాకిస్థాన్‌ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించా రు. దీనిపై పూర్తి దర్యాప్తును ప్రారంభించాం’ అని అసోం సీఎం తెలిపారు.