గృహావసరాలకు సిలిండర్ కొరత లేదు
- వాణిజ్య సిలిండర్ల సరఫరాలో మాత్రమే కొరత
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : తెలంగాణలో వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్ల కొరత వాస్తవమేనని, కానీ గృహ అవసరాలకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ప ష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మా ట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86 శాతం గృహ అవసరాల కనెక్షన్లేనని స్పష్టం చేశారు.
అలాగే మిగిలిన 14 శాతం మాత్ర మే వాణిజ్య కనెక్షన్లు అని వివరించారు. ప్ర స్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని తమ శాఖ అధికారు లు వెల్లడించారని చెప్పారు. కానీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమని తెలిపారు. రాష్ట్రంలో వంట గ్యాస్ తాజా పరిస్థి తిపై చర్చించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికా రులు, చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్షిస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు.
రాష్ట్రంలో రోజూ ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం, సరఫరా ఏ మేర కు ఉంది, గ్యాస్ కొరతకు గల కారణాలు, అందుకు అధిగమించేందుకు తీసుకోవాల్సి న చర్యలతోపాటు ప్రత్యామ్నాయాలపై దృ ష్టి పెట్టేందుకున్న మార్గాలన్నింటిపై చర్చించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే పూర్తి వివరాలతో రావాలని ఆయిల్ కంపెనీల ప్ర తినిధులతోపాటు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పు డు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి ఉత్త మ్ వెల్ల డించారు.
డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోందని, దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం శుక్రవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.




