మరణించిన ఉద్యోగి పిల్లలకు సాయం
రూ.3 లక్షల ఎఫ్‌డీ పత్రాన్ని అందించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) :అనారోగ్యంతో మృతి చెందిన టీ ఫైబర్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బుర్రా నాగరాజారావు ఇద్దరు పిల్లలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. గురువారం సచివాలయంలో నా గరాజా రావు కుమార్తె సుప్రీతికి రూ. 3 లక్ష ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేశారు. తన అమ్మమ్మ వెంకట లక్ష్మితో వచ్చిన 14 ఏళ్ల సుప్రీతిని పట్టుదలతో చదువుకుని ఉన్న త స్థాయికి ఎదగాలని ధైర్యం చెప్పారు. ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా తన కార్యాలయాన్ని సంప్రదించాలని మంత్రి సూచించారు.
సుప్రీతి తల్లి గత జూన్‌లో మరణించగా తండ్రి సెప్టెంబరులో అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. దానితో అనాథలైన ఇద్దరు చిన్నారులను హుజారాబాద్‌కు చెందిన అమ్మమ్మ చేరదీసింది. శ్రీధ ర్ బాబు ఆదేశాల మేరకు పిల్లలను ఆర్థికం గా ఆదుకునేందుకు టీ పైబర్ కార్పొరేషన్ ఎండీ పన్నీరు వేణు ప్రసాద్ తమ సంస్థ తరపున రూ.3 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిం చారు. నాగరాజా రావు కుమారుడు సంప్రీ త్ ఇంటర్, కుమార్తె సుప్రీతి 9వ తరగతి చదువుతోంది.




