ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియకు సహకరించాలి
15-07-2026 01:57 AM
ఆర్డీఓ విజయకుమారి
బోధన్ ,జులై 14విజయ క్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోధన్ ఆర్డీఓ విజయకుమారి కోరారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ఎల్బిఎస్ నగర్ లో గల కమ్యూనిటీ భవనంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ ను ఆర్డీఓ విజయకుమారి పరిశీలించారు. నిర్ణీత గడువు లోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని బిఎల్‌ఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, వార్డ్ కౌన్సిలర్ దాము తదితరులు ఉన్నారు.






