టీఆర్టీ కమ్యూనిటీ హాల్‌ను ప్రజల అవసరాలకే కేటాయించాలి
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్
ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): ప్రజలకోసం నిర్మించిన టిఆర్ టి కమ్యూనిటీ హాల్ ను వారికే కేటాయించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం జీహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ రత్నకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు నిర్మించిన కమ్యూనిటీ హాల్ పై అధికారుల పెత్తనం చెలాయించడం సబబు కాదన్నారు.
ఏ విధంగా పేద ప్రజల శుభకార్యాలకు కేటాయించకుంటే సహించబోమన్నారు. అధికారులు టిఆర్ టి కమ్యూనిటీ హాల్ పై తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలన్నారు. పేద ప్రజల అవసరాల మేరకు వారి చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఆనంద్ రావు, కాంగ్రెస్ నాయకులు గుర్రం శంకర్, అభిషేక్ కెనడి, మధుమతి, ప్రవీణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.






