విద్యార్థి దశ కీలకం, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలో పదవ తరగతి ఫలితాలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు లోలపు పోశెట్టి చౌహన్ హరి సింగ్ లు కోరారు. శనివారం మండలంలోని పార్టీ( కె) గ్రామానికి చెందిన చౌహన్ స్మరణ సింగ్ లాటియా సూరత్ సింగ్ సునాల గ్రామానికి చెందిన షేక్ జోహార్ స్కిన్ కసిరి మధులీతలను సన్మానించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పదవ తరగతి నుండి డిగ్రీ పూర్తయ్యే వరకు విద్యార్థులు దుర్ వ్యసనాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం చదవాలని కోరారు విద్యార్థులు ఎదిగితే తల్లిదండ్రులకు పేరు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘ అధ్యక్షులు చౌహాన్ వినోద్, సర్పంచులు శ్రీరామ్ లక్ష్మణ్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు జంగాల భోజన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మ డైరెక్టర్ నుండే శ్రీధర్ బాశెట్టి సుదర్శన్ తుల అజయ్ కుమార్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమూద్ నాయకులు సంగ్రామ్ భీమ్రావు పాటిల్ వార్డు సభ్యులు మాజీ భోజరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు






