18 May, 2026 | 3:30 AM

కేసీఆర్ కృషితోనే రాష్ట్రం అభివృద్ధి: సండ్ర వెంకటవీరయ్య

18-05-2026 02:24 AM

కల్లూరు,మే 17(విజయ క్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కల్లూరు,పెనుబల్లి, తల్లాడ మండలాల బి ఆర్ ఎస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం డీఎన్పీ ఫంక్షన్ హాల్లో జరిగింది.

ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ త్వరలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామ స్థాయి నాయకులు బీఎల్వోలతో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలించి మార్పులు, చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డబుల్ ఓట్లు తొలగిం పునకు చర్యలు తీసుకుంటూ,ప్రతి ఓటరు ఒకే చోట ఓటు వినియోగించుకునే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్త గ్రామాల్లో అందుబాటులో ఉండి ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఆన్లైన్ సభ్యత్వంపై దృష్టి

ఈసారి బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బూత్కు ఇద్దరు స్మార్ట్ఫోన్ కలిగిన యువకులను ఎంపిక చేసి ఇంటింటికి వెళ్లి ఫోటోతో సహా సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు.గ్రామ స్థాయి నాయకులు వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకం వేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని గుర్తుచేశారు.ప్రస్తుతం లారీలు,హమాలీలు,గన్నీ సంచులు కొరతతో పాటు మిల్లర్ల సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే సుమారు 70 శాతం ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారని, మిగిలిన ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై ఇప్పటికే తల్లాడ,కల్లూరు,పెనుబల్లి మండలాల్లో ధర్నాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలపై ఆందోళన 

నీట్ పేపర్ లీక్ ఘటనపై కూడా సండ్ర స్పందిస్తూ,లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.నిరుద్యోగులు, విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.  మాజీ జెడ్పిటిసి లు కట్ట అజయ్ కుమార్, చెక్కిలాల మోహన్ రావు, లక్కినేని రఘు, సీనియర్ నాయకులు, కోటగిరి సుధాకర్ బాబు రెడ్డెం వీర మోహన్ రెడ్డి,బోబోలు లక్ష్మణరావు, దుగ్గిదేవర.వెంకట్ లాల్, పెడకంటి.

రామకృష్ణ, కొరకొప్పు ప్రసాద్, మేకల కృష్ణ, మందడపు అశోక్ కుమార్, పసుమర్తి వెంకటేశ్వరరావు, ఇస్మాయిల్,  నర్వనేని అంజయ్య, షరాబు వెంకటేశ్వరావు, లగడపాటి శ్రీనివాసరావు, బెల్లంకొండ చలపతిరావు, గోదా చెన్నారావు, రాజ్ కుమార్, గుగులోత్ శ్రీనివాసరావు, ఉబ్బన వెంకటరత్నం, రాచమల్ల నాగేశ్వరావు మేకల కృష్ణ,సిహెచ్ కిరణ్, ఇంతియాజ్, మరకల చంటి, ఇర్ఫాన్ సన్నీ పాల్గొన్నారు.