15 June, 2026 | 4:54 AM

సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు

15-06-2026 12:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 14: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోని అఖండ జ్యోతి స్వరూప శ్రీ సూ ర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాధి క్షేత్రంలో ఆదివారం కావడంతో భక్తులు పో టెత్తారు.తెల్లవారుజామున స్వామివారిని ప్ర త్యేకంగా అలంకరించి అభిషేకాలు,అర్చనలు జరిపారు.మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమం నిర్వహించారు.క్షేత్ర ఆవరణ లోని కార్యసిద్ధి వీర హనుమాన్,శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శిం చుకున్నారు.వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద సత్రంలో అ న్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్, గణపురం నరేష్,అడ్వకేట్ ఈశ్వర్ కుమార్, అర్చకులు భీంపాండే,భక్తులు తదితరులు పాల్గొన్నారు.