calender_icon.png 14 February, 2026 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజమైన ‘విజయక్రాంతి’ సర్వే

14-02-2026 01:18:26 AM

కాంగ్రెస్ పార్టీ  చైర్ పర్సన్ అభ్యర్థిని ఓటమి

వలస నాయకులను నమ్మని పేట పుర ప్రజలు 

డబ్బులు, చైనాలు, పంచినా ఓ అభ్యర్థినీ ఆదరించనీ వార్డు ప్రజలు 

నారాయణపేట. ఫిబ్రవరి,13(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో శుక్రవారం నాడు వెలువడిన ఫలితాల్లో పేట పుర పీఠం దక్కే దేవరికో అనే శీర్షిక బుధవారం నాడు పార్టీల వారిగా గెలుపెవరిదో పేరిట వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే ఎన్నికల ఫలితాల్లో విజయక్రాంతి దినపత్రిక చేసిన సర్వే ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కి 8, బిజెపికి 10,బారాస కు 4, స్వతంత్రులు 2 ఏ ఐ ఎం ఐ ఎం కు1  ఇవ్వగా పలితాలునిజం అని వెలువడినాయి.

శుక్రవారం నాడు వెలువడిన ఫలితాల్లో మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ కి 7 సీట్లు, బిజెపి కి 11 ,సీట్లు, బిఆర్‌ఎస్ పార్టీకి 2,సీట్లు ఏఐఏం ఐ ఎం కు2,  సీట్లుఏ ఐ ఎఫ్ బీ 1,స్వతంత్రులు 1 ఇద్దరు మొత్తం 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల వారిగా విజయం సాధించారు ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ సీటును ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటా పోటీగా హాంగ్ రావటంతో  కొంత డైలమాలో పడ్డారు 16 నాడు  ఇరు పార్టీల మధ్య వాడి వేడిగా చైర్ పర్సన్ సీటును  ఏపార్టీ కైవసం చేసు కుం టుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది 

ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి ఇటు బీజేపీ కి కాంగ్రెస్ పార్టీకి కీలకం కాగా బి ఆర్ ఎస్ పార్టీ మాత్రం వైస్ చైర్మన్ పదవి కోసం అయినాకాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వొచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు దీంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత ముందుగానేపార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాదని వ్యారవేత్తను చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించటం తో పుర పీఠం చే జారి పోయిందని విమర్శలు సైతం ఉన్నాయి.