calender_icon.png 14 February, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలపడుతున్న బీజేపీ !

14-02-2026 01:13:59 AM

  1. గతంలో కంటే ఆ పార్టీపై ప్రజల్లో పెరిగిన ఆదరణ, సీట్లు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఓటర్ల చూపు

కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో రాని ఫలితాలతో క్యాడర్ డీలా

స్థానికంగా ఉంటూనే చమటోడ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు

2 నుంచి 25 ఓట్ల తేడాతో ఓడిన వార్డులు 200 వరకు..

వెనుకబడ్డ మున్సిపాలిటీ ఫలితాలపై విశ్లేషించనున్న పార్టీ నాయకత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగు తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నా య శక్తిగా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్ని కల్లో బీజేపీ బలం కొంత పెరిగింది. గతంలో కంటే ఈసారి అత్యధిక స్థానాలను ఆ పార్టీ  కైవసం చేసుకుంది. సాయంత్రం వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం 260 వర కు వార్డులు, రెండు కార్పొరేషన్లు, రెండు నుంచి ఐదు వరకు మున్సిపాలిటీలు, 70కిపైగా డివిజన్లలో విజయం సాధించింది.

మొ త్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 350 వరకు స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తుందనే ధీమాలో రాష్ట్ర నాయకత్వం ఉం ది. గతంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రెం డు మున్సిపాలిటీలు, 241 వరకు వార్డుల్లో కౌన్సిలర్లను గెలుచుకుంది. దీంతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో క్యాడర్ డీలా పడింది.  

ఉత్తర తెలంగాణపై పట్టు  

ముందు నుంచి ఉత్తర తెలంగాణలో ప ట్టు ఉన్న బీజేపీకి ఆ స్థానాల్లోనే కాషాయం జెండా ఎగురేసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలున్న ప్రాంతాలు కూడా అదే ప్రాంతానికి చెందిన వారున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో అత్య ధిక స్థానాలను గెలుచుకుంది. కార్పొరేషన్ల ఫలితాల్లో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్‌లో బీజేపీని ఓటర్లు నిలబెట్టారు.

నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేసన్లను బీజేపీ దక్కించుకోవడం అంటే అధికార  కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు భవిష్యత్ రాజకీయాలకు ఓ రకంగా సవాల్ విసిరిందనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో సీట్లు సాధించారని విమర్శించిన వారికి ఈ ఫలితాలు మిం గుడు పడని అంశంగానే చూడాల్సి ఉంటుం ది. కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్‌లో సత్తా చాటగా, ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్‌లో బీజేపీ జెండాను ఎగురవేశారు.

మున్సిపాలిటీల్లోనూ బీజేపీకి మెరు గైనా ఫలితాలే దక్కాయని చెప్పాలి. భవిష్యత్తులో తెలంగాణపై ఫోకస్ పెట్టేందుకు ఈ ఎన్నికలు ఆ పార్టీకి దోహదం కానున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డులకు గానూ 21 వార్డుల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో గతంలో కంటే బీజేపీ మెరుగుపడింది. వేములవాడ, రాయికల్, నారాయ ణపేట్, మెట్‌పల్లి చైర్మన్ పదవులను బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి.

ఖానాపూర్, బైం సా ప్రాంతాల్లోనూ మంచి స్థానాలనే గెలుచుకుంది. ఉత్తర తెలంగాణ కంటే దక్షిణ తెలంగాణలో నాయకులు అనుకున్నంత స్థానాల్లో సీట్లను సాధించలేకపోయింది. నల్లగొండ, సూర్యాపేటలో  ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. వరంగల్‌లోనూ అంతే. యాదాద్రి భువనగిరిలో ఎక్కువ వార్డులనే గెలుచుకుంది. 

చమటోడ్చిన నాయకత్వం 

గ్రామపంచాయతీ ఎన్నికలను పెద్దగా సీరియస్‌గా తీసుకోని పార్టీ నాయకత్వం, క్యాడర్ ఈ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను మాత్రం చాలా సీరియస్‌గా తీసు కుంది. ఈ మేరకు ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా క్షేత్రస్థాయిలోనే ఉం టూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్ర భుత్వ పాలనపై చార్జ్ షీట్ విడుదల చేయ డం,

ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయ డం లాంటివి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలను ప్రజల్లోకి విస్తృతంగానే తీసుకెళ్లారు. కానీ, అవి పెద్దగా ఫలితాలను రాబట్టలేదని తెలుస్తోంది. అయితే పార్టీ అగ్రనాయకుల ప్రచారం కలిసిరాలేదనే చెప్పాలి. జాతీయస్థాయి నాయకులతో మరిన్ని సభ లు నిర్వహిస్తే బాగుండేదనే చర్చ పార్టీ శ్రేణు ల్లో జరుగుతోంది.

బలమైన అభ్యర్థులు కూడా చాలా చోట్ల బీజేపీ నిలబెట్టలేదు. త్రి ముఖ పోరులో బీజేపీ వెనుకపడింది. గెలిచే అవకాశాలున్న గానీ, ఇతర పార్టీల అంగ, అర్థబలంతో మూడోస్థానాల్లో నిలిచింది. సహజంగానే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే గెలుపు అవకాశాలెక్కువగానే ఉంటా యి. బీజేపీ ఈస్థాయిలో సీట్లను సాధిస్తుందని అస్సలు ఊహించలేదు. 70 వరకు ము న్సిపాలిటీలు, రెండు లేదా మూడు కార్పొరేషన్లను లక్ష్యంగా పెట్టుకుని బరిలో దిగింది.

కార్పొరేషన్ ఫలితాలు ఆ పార్టీకి సంతృప్తిని కలిగించినప్పటికినీ మున్సిపాలిటీ ఫలితాలు మాత్రం అసంతృప్తినే కలిగించాయి. అయితే పార్టీ విజయం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం చమటోడ్చింది. రాష్ట్ర నాయకత్వం పైకి ఈ ఫలితాలపై తాము సంతోషంగానే ఉన్న ట్లు ప్రకటించినా కానీ, లోలోపల మాత్రం షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలపై పోస్టుమార్టం చేయనున్నారు. వెనుకబడ్డ మున్సిపాలిటీల ఫలితాలపై లోతుగా విశ్లేషణ చేయనున్నారు.