క్వార్టర్ ఫైనల్లో మొరాకో
వరల్డ్‌కప్ నుంచి కెనడా ఔట్
హాస్టన్, జూలై 5: సాకర్ ప్రపంచకప్‌లో ఆతిథ్య కెనడా పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో మొరాకో 3 గోల్స్ తేడా తో కెనడాపై విజయం సాధించింది. తొలి అర్థభాగం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గోల్స్ నమోదు కాలేదు. సెకండాఫ్ లోనూ మాత్రం మొరాకో అదరగొ ట్టింది. స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ కొట్టింది.
ఇంజ్యూరీ టైమ్‌లో మరో గోల్ కొట్టి తిరుగులేని విజయాన్ని అందుకుంది. మొరాకో ప్లేయర్ అజిడినో రెండు గోల్స్ చేయగా చివర్లో రహిమి ఒక గోల్ సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఎక్కువసేపు కెనడా ఆధిపత్యమే కనిపించినా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. గోల్స్ చేసే అవకాశాలను వృథా చేసుకుంది. కాగా ఈ విజయం తో వరుసగా రెండు సార్లు క్వార్టర్ ఫైనల్స్ చేరిన ఆఫ్రికన్ జట్టుగా రికార్డులకెక్కింది.






