6 May, 2026 | 4:17 AM

ప్రధాని భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలి

06-05-2026 02:53 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు

సికింద్రాబాద్, మే5 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈనెల 10న జరిగే ప్రధాని భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజల తరలివచ్చి  జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తార్నాక ప్రాంతంలో బిజెపి రాష్ట్ర  ఉపా ధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి తదితరులతో కలిసి పరేడ్ గ్రౌండ్‌లోమోడీ సభను విజయవంతం చేయాలి అంటూ వాల్ రైటింగ్ రాశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.