21 April, 2026 | 4:44 AM

సొంతింటి కల నెరవేర్చుతున్న ప్రజాపాలన ప్రభుత్వం

21-04-2026 03:15 AM

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట ఏప్రిల్ 20: సొంతింటి కల నెరవేర్చుతున్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం అడుగులు వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్ర పరిధిలోని లాల్ కోట, బండర్ పల్లి గ్రామాల్లో  ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసుదన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఫర్దిపూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శివ కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే జియంఆర్ కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.