ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
21-04-2026 03:16 AM
గట్టు ఏప్రిల్ 20: గట్టు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రోత్సవాల నడుమ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఆర్యవైశ్య సంఘం నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గట్టు మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు ,ఆర్యవైశ్య సంఘం గద్వాల పట్టణ అధ్యక్షులు నాయకులు ఆలూరు రామయ్య శెట్టి, శ్రీకాంత్, మోహన్ గౌడ్, రాముడు ,రాజప్ప గౌడ్ ,గోవిందు తదితరులు పాల్గొన్నారు






