21 April, 2026 | 4:42 AM

విద్యార్థులకు శుభ్రమైన ఆహారం : కలెక్టర్

21-04-2026 03:13 AM

గోపాలపేట ఏప్రిల్ 20: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనకి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాఠశాల వంటగది (కిచెన్) మరియు మెస్ను పరిశీలించారు.

కిచెన్, మెస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆహార సామాగ్రి నిల్వ రిజిస్టర్లను పరిశీలించి, మెస్ కమిటీ విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అనే అంశంపై విచారణ చేశారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న సదుపాయాలు, హాస్టల్ సమస్యలు తదితర అంశాలపై విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే ఆహారాన్ని సూపర్వైజర్ ముందుగా రుచి చూసి, అనంతరం విద్యార్థులకు అందించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు.

విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ....

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆర్ బీ ఎస్ కే ఆధ్వర్యంలో కంటి పరీక్ష శిబిరాల ద్వారా మొత్తం 6950 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, 570 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించగా, ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థుల్లో 69 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా కంటి మద్దాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో స్వచ్చంద సంస్థ అధికారులు,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, డి వై ఎస్ ఓ సుధీర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.