9 July, 2026 | 3:58 AM

ప్రజల ఆకాంక్షలను మీడియా వెల్లడించాలి!

09-07-2026 12:00 AM
  1. సోషల్ మీడియాలో హద్దు దాటితే ప్రమాదమే
  2. ఐజేయూ సదస్సులో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి 

భద్రాచలం, జులై 8 (విజయక్రాంతి): ప్ర జల ఆకాంక్షలను, మనోభావాలను  మీడి యా వెల్లడించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోషల్ మీడియా ప్రజల మనోభారాలను తీర్చలేదని ఆయన అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజెయు) భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలంలో ‘సమాజంపై సోషల్ మీడియా ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాంనారా యణ అధ్యక్షతన జరిగిన సదస్సులో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య వక్తగా  ప్రసంగించారు. చట్టం పరిధిలోకి రాని సోషల్ మీడియా పరిధి హ ద్దులు దాటితే ప్రమాదకరమని హెచ్చరించారు.

డిజిటల్ యుగంలో అసలైన జర్నలి స్టులు చట్ట పరిధిలోకి వస్తారని సోషల్ మీడి యా ప్రతినిధులు చట్టం పరిధి దాటి పనిచేస్తారని చెప్పారు. వారికి గేట్ కీపర్ లేని కార ణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది సమాజానికి మంచిది కాదని అన్నారు. ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని చూడొచ్చని, సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో మంచి చెడులను పరిగణ లోకి తీసుకునే ఆలోచన పెరగకపోతే అది సమాజంపై విష ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

పత్రికల స్థానాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మింగేసిన క్రమంలో యూరప్‌లో పత్రికల మనుగడ అంతరించిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి మనదేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో డిజిటల్ యుగం సమాజాన్ని ఏలుతుందని ఇదే ఫైనల్ అవుతుం దని అనుకుంటే పొరపాటు అవుతుందని అన్నారు. 2025 వరకు 14 ఇంటర్నెట్ కలెక్షన్లు ఉన్నాయని అత్యధికులు 44 ఏళ్ల లోపు వారే ఎక్కువగా దీని ఉపయోగిస్తున్నారని పే ర్కొన్నారు.

ఇంటర్నెట్‌ను వీక్షించే వారిలో 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వర కు ఉన్నవారు 33 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత కమ్యూనికేషన్ పెంచుకోవచ్చని, కోట్లాదిమందికి సమాచారం అందించే శక్తి డిజిటల్ మీడియాకు వచ్చిందన్నారు.  భక్తుల అంతరంగిక అంశాలపై డిజి టల్ మీడియా ను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఐ జెయు జాతీయ సెక్రెటరీ జెనరల్ సోమసుందర్, ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్, ఐ జె యు  నేషనల్ కౌన్సిల్ సభ్యులు బివి రమ ణా రెడ్డి, టి యు డబ్ల్యూ జే (ఐ జె యు ) రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జె వి రత్నం, కార్యదర్శి జును మాల రమేష్, కోశాధికారి చీమకుర్తి కుర్తి శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆర్ నవీన్ కార్యదర్శి నాగేంద్ర కోశాధికారి రాజేష్ తో పాటు పలువురు జర్నలిస్ట్ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.