9 July, 2026 | 3:02 AM

ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారి

09-07-2026 12:00 AM

15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వే ల్యాండ్స్ సూపరింటెండెంట్ 

భూత్పూర్, జూలై 8: మహబూబ్‌నగర్ జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డు డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూత్పూర్ మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి సంబంధించిన మ్యాప్ వివరాలను సరిచేయాలని సర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డిని సంప్రదించాడు.

అందుకు ఆయన లంచం డిమాండ్ చేశాడు. అప్పటికే రైతు రూ.10 వేలు ఇవ్వగా మరో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ సూచనలతో బుధవారం రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.