నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం?
- 17 టీఎంసీల వాటా కాగితాలకే పరిమితం
- తాగునీటి కోసం మరో 2 టీఎంసీల మళ్లిస్తున్న కర్ణాటక
- పరిష్కారం చూపకపోతే రెండు ప్రభుత్వాలపై ఉద్యమమే
- బీఆర్‌ఎస్ నాయకుల హెచ్చరిక
- కర్ణాటక సరిహద్దులోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సందర్శనలో
గద్వాల, జూలై 8 (విజయక్రాంతి): కర్ణాటక సరిహద్దులోని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)ను బుధవారం ఉమ్మడి పా లమూరు జిల్లా బీఆర్‌ఎస్ నాయకుడు ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, రా మ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్‌లతో ఉమ్మడి జిల్లా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ..
తెలంగాణకు రావాల్సిన 17 టీఎంసీల నీటిలో కనీసం ఐదు టీఎంసీలు కూడా అందడం లేదని ఆరోపించారు. ఎగువన కర్ణాటకలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కొత్త నీటి మళ్లింపు పనులు కొనసాగితే తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టు భవిష్యత్తు ప్రమా దంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశా రు. రాజోలి బండ వద్ద తెలంగాణకు నీరు మళ్లించే ప్రాంతానికి మరో రెండు టీఎంసీల నీటిని మళ్లించే పనులు ప్రారంభించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
ఇది తాగునీటి పథకం కాదని, తెలం గాణ సాగును ఎడారిగా మార్చే ప్రయత్నమ ని వారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒకప్పుడు సుమారు 87 వేల ఎకరాలకు సాగు నీరు అందించిన ఆర్డీఎస్, ప్రస్తుతం 8 వేల ఎకరాలకు కూడా నీరు అందని దుస్థితికి చేరుకుందని తెలిపారు. దశాబ్దాలుగా తెలంగాణకు న్యాయమైన నీటి వాటా ఇస్తామని చెప్పిన ప్రభుత్వాల హామీలు అమలుకు నో చుకోలేదని, ఆర్డీఎస్ కేవలం ఒక ప్రాజెక్టు కాదని, పాలమూరు రైతాంగ జీవనాడి అని వారు పేర్కొన్నారు.






