12 May, 2026 | 9:41 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

శాసన సభ, మండలి నిరవధిక వాయిదా

07-01-2026 01:09 AM

మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చ 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. శాసన మండలి నిరవధికంగా వాయిదాపడింది. ఈ సమావేశాల్లో 19 గంటల 52 నిమిషాల పాటు సభ జరిగింది. రచయిత అందె శ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తూ ప్రవేశపెట్టిన బిల్లును శాసన మండలి మంగళవారం ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే కవిత కూడా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్‌కు కవిత విజ్ఞప్తి చేశారు.