18 April, 2026 | 11:15 AM

భక్తులతో కిటకిటలాడిన కేతకి ఆలయం

18-04-2026 01:26 AM

జహీరాబాద్, ఏప్రిల్ 17: జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండల కేంద్రంలో గల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమావాస్యను పరిష్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు కేతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

దైవ దర్శనం కోసం దాదాపుగా ఐదారు గంటల సమయం పట్టింది. ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో దైవ దర్శనానికి వెళ్లేందుకు పోలీసులు ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన కొందరు క్యూ లైన్ లో పంపించకుండా అడ్డదారులు దర్శనానికి పంపించడం వల్ల క్యూలో నిలబడిన వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కొందరు భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉదయం ఎనిమిది గంటలకు క్యూలైన్లో నిలబడగా అడ్డదారులో వచ్చిన వారితో ఇబ్బందులు పడ్డామని తనకు 12 గంటల వరకు దర్శనం కాలేదని నేరుగా ఆలయ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఈ విధంగా కొందరు డబ్బులను తీసుకొని అడ్డదారులు పంపించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నారాయణఖేడ్ ప్రాంత చాప్ట కె గ్రామానికి చెందిన జి అనిల్ రెడ్డి ఫిర్యాదు చేశారు.