18 April, 2026 | 9:33 AM

సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయండి

18-04-2026 01:27 AM

ఉద్యోగ సంఘాల డిమాండ్.. నల్ల బ్యాడ్జీల నిరసన 

తాండూరు ,ఏప్రిల్ 17 ( విజయక్రాంతి) :  ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కార కోసం రాష్ట్ర  ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం  వికారాబాద్ జిల్లా పెద్దముల్ తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో  వివిధ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.