సింగరేణి చరిత్రలోనే నూతన అధ్యాయం
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి
భూపాలపల్లి/ మల్హర్,జూలై 14 (విజయ క్రాంతి): జిల్లా మల్హర్ రావు మండల పరిధిలోని బొగ్గు గనుల చరిత్రలో సరికొత్త అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యంత భారీ గనిగా అవతరించబోతున్న ’తాడిచర్ల కోల్బ్లాక్-2’ రాబోయే రోజుల్లో మల్హర్ రావు మండలానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఒక మణికిరీటంగా నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా తాడిచర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
గడిచిన రెండు దశాబ్దాలుగా కేవలం చర్చలకే పరిమితమైన తాడిచర్ల కోల్బ్లాక్ అంశాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయంతో సింగరేణికి కేటాయించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ గని ద్వారా ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు జరిగి, భారీగా ఉపాధి అవకాశాలు రావాలనే దశాబ్దాల నాటి స్థానిక ప్రజల కల నెరవేరబోతోందన్నారు. రూ. 1.20 లక్షల కోట్ల టర్నోవర్.. 50 ఏళ్ల ఉత్పత్తి అవుతుంది అని అన్నారు.
మండలంలోని ఈ తాడిచర్ల కోల్బ్లాక్-2 గనిలో దాదాపు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా వేశారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్దది కావడంతో దీనిని బాహుబలి కోల్ మైన్ గా అభివర్ణిస్తున్నట్లు తెలిపారు. మిట్టింగ్ కు ఆలస్యంగా వచ్చిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను చూసి కార్యకర్తలు, ప్రజలు కేరింతలు కొడుతూ, ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర పార్టీ అద్యక్షులు రాంచందర్ రావు,
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి ఫ్లోర్ లీడర్ అలెటి మహేశ్వర్ రెడ్డీ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సీతరాం నాయక్, రాష్ట్ర నాయకులు, మంథని నియోజకవర్గ ఇంచార్జీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు చంద్రుపట్ల కీర్తి రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా నారయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్యప్రకకాష్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు బండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






