18 April, 2026 | 12:39 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

హైవే అండర్ పాస్ విషయాన్ని మంత్రి గడ్కరీకి విన్నవించండి

18-04-2026 01:26 AM

ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి వినతి పత్రమిచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ళ ఏప్రిల్ 17(విజయక్రాంతి): హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన చోట అండర్ పాసులు ఏర్పాటు చేయాలని ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కోయారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు శుక్రవారం ఎంపి కలిసి అండర్ పాస్ల విషయాన్ని చర్చించారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి అండర్ పాస్ ల సమస్య తీసుకెళ్లి అవసరమైన చోట అండర్ పాస్ల నిర్మాణానికి కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు.  హైవే నుండి కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కొండకు వివరించారు. క్రితం ఇచ్చిన రోడ్డు మ్యాప్ ప్లాన్ సవరించి అవసరమైన చోట అండర్ బాక్సులు నిర్మించాలని కోరారు.