2 May, 2026 | 3:31 AM

సర్కారు తిరకాసు!

02-05-2026 02:40 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త మోడల్ 

  1. ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీల మధ్య వివాదం 
  2. కాలేజీల ఆర్థిక నిర్వహణకు సవాల్ 
  3. హైకోర్టు జోక్యంతో లోపాలు బహిర్గతం 
  4. పాలసీ అమలులో లోపాలే గందరగోళానికి కారణం  
  5. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోడల్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఓ 7 ద్వారా డబ్బును నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమచేసే విధానాన్ని అమలుచేయడమే ఈ పరిస్థితికి అసలు కారణం. విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయంగా చెబుతున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపు విధానంలో పారదర్శకతను పెంచుతామని స్పష్టంచేస్తున్నది.

తమ కాలేజీల ఆర్థిక నిర్వహణలో అనిశ్చితి పెరుగుతుందని వాదిస్తున్న యాజమాన్యాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనికి తోడు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆలస్యమైతే ఎవరిని సంప్రదించాలి అన్న స్పష్టత లేక విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. ప్రభుత్వ ప్రవేశ పెడుతున్న పాలసీ ఉద్దేశం సానుకూలమైనప్పటికీ, అమలు లోపాలు, సమన్వయం లేకపోవడం, బాధ్యతలపై క్లారిటీ లేకపోవడంమొత్తం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినట్టు కనిపిస్తోంది.

దీంతో ప్రభుత్వం, -కాలేజీల మధ్య పోరులో చివరకు నష్టపోతున్నది మా్ర తం విద్యార్థులేనని విద్యార్థి సంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కొత్త విధానం అమలుతో ఇప్పటివరకు ప్రభుత్వకాలేజీల మధ్య జరిగే చెల్లింపు ప్రక్రియలో ఇప్పుడు విద్యార్థులే కీలకంగా మారుతున్నారు. ప్రభుత్వం డబ్బును నేరుగా వారి ఖాతాల్లో జమచేయడంతో, ఆ మొ త్తాన్ని సమయానికి కాలేజీలకు చెల్లించే బాధ్యత పూర్తిగా విద్యార్థులపైనే పడింది.

అయితే ఈ విధానం విద్యార్థులకు అనుకూలంగానే అనిపించినా వాస్తవానికి ఇది వారికి అదనపు ఒత్తిడిగా మారే అవకాశముంది. ముఖ్యంగా డబ్బు జమ కావడంలో ఆలస్యం జరిగితే, కాలేజీలు ఫీజుల కోసం ఒత్తిడి చేయడం, క్లాసులకు అనుమతించకపోవడం, హాల్‌టికెట్లు నిలిపివేయడం వంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యమైతే ఎవరిని సంప్రదించాలి అన్న గందరగోళం నెలకొంటుంది.

ప్రభుత్వం, బ్యాంకులు, కాలేజీలు మూడు వేర్వేరు దశ ల్లో ఉండటంతో, విద్యార్థి తన సమస్యను ఎక్కడ చెప్పాలి అన్నది స్పష్టంగా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ అనిశ్చితి విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి మరిం త క్లిష్టంగా మారే అవకాశముంది. ఫీజులు ముందుగా చెల్లించాల్సి వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 

కాలేజీలకు సవాల్..

ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మ ధ్య వర్తిత్వాన్ని తొలగించి, డబ్బు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పారదర్శకత పెంచడం, లీకేజీలను అరికట్టడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయి తే అమలు స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారుతోంది. చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయన్న టైమ్‌లైన్‌పై స్పష్టత లేకపోవడం, డబ్బు విడుదల నుంచి కాలేజీలకు చేరే వరకు సరైన ట్రాకింగ్ వ్యవస్థ లేకపోవడం, విద్యార్థుల ద్వారా ఫీజు చెల్లింపులపై పర్యవేక్షణ లోపించడం వంటి అంశాలు గం దరగోళానికి దారితీస్తున్నాయి.

దీంతో ప్రభు త్వం, కాలేజీలు, బ్యాంకులు తమ తమ వాదనలు వినిపిస్తున్నప్పటికీ సమస్యను నిర్ధారిం చడం కష్టంగా మారుతోంది. అయితే ప్రభు త్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో ప్రైవేట్ కాలేజీల ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుం చి నేరుగా చెల్లింపులు రావడం వల్ల కొంతవరకు ఆదాయం స్థిరంగా ఉండేది. కానీ ఇప్పు డు డబ్బు విద్యార్థుల ఖాతాల్లోకి వెళ్లి, అక్కడి నుంచి కాలేజీలకు చేరాల్సి రావడంతో ఆ స్థిరత్వం దెబ్బతింటోందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకంగా చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే సమస్య మరిం త తీవ్రంగా మారే అవకాశముంది.

సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, మౌలిక వసతుల నిర్వహణ, బ్యాంకు రుణాల చెల్లింపులన్నీ సమయానికి వచ్చే ఫీజులపైనే ఆధారపడి ఉంటాయి. కానీ విద్యార్థుల ద్వారా ఫీజులు వచ్చే వ్యవస్థలో సమయపాలనపై హామీ లేకపోవడం కాలేజీలకు ఆర్థిక అనిశ్చితిని తీసుకొస్తోంది. మరోవైపు విద్యార్థులు డబ్బు పొందిన వెంటనే కాలేజీలకు చెల్లిస్తారనే గ్యారంటీ లేకపోవడం.. కొందరు విద్యార్థులు ఆలస్యం చేసే అవకాశముండటంతో, ఫీజుల వసూళ్లు విడతలవారీగా, అనిశ్చితంగా మారే పరిస్థితి ఉంది.

ఇది పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న సంస్థలకు మరింత భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో కాలేజీలు తాత్కాలికంగా బ్యాంకులపై లేదా ఇతర వనరులపై ఆధారపడాల్సి రావడం, వడ్డీ భారం పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్ర మాదం ఉంది. మొత్తంగా, కొత్త విధానం వల్ల కాలేజీల ఆర్థిక నిర్వహణలో స్థిరత్వం తగ్గి, అనిశ్చితి పెరుగుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

హైకోర్టు జోక్యంతో.. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ కొత్త విధానంపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో, గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్న హైకోర్టు వ్యాఖ్య లతో పాలసీ రూపకల్పనలో సమన్వయం లోపించిందన్న సందేహాలను మరింత పెం చుతున్నాయి. కోర్టు ధిక్కరణ అంశాన్ని కూ డా ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతను స్ప ష్టంగా తెలియజేస్తోంది. న్యాయపరంగా చూ స్తే, ప్రభుత్వ నిర్ణయాలు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలి. అయితే ఈ కేసులో అలాంటి సమన్వయం కనిపించకపోవడం వల్లే హైకోర్టు తాత్కాలిక స్టే విధించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కేవలం ఒక జీవోపై వివాదం మాత్రమే కాకుండా పాలసీ అమ లు విధానాలపై పెద్ద ప్రశ్నార్థకంగా మారిం ది. దీంతోపాటు హైకోర్టు జో క్యంతో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాల్లో తక్షణ సవరణలు అవసరమని స్పష్టమవుతున్నదని విశ్లే షకులు చెబుతున్నారు. కోర్టు జోక్యం లేకపోతే అమలు దశలో ఉన్న లోపాలు మరిం త తీవ్రమయ్యే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలసీ ఉద్దేశం సానుకూలమైనదైనా.. న్యాయపరమైన, అ మలు పరమైన సమన్వయం లేకపోతే అది సమస్యలకు దారితీస్తుందన్న దానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. 

ప్రభుత్వానికి సవాళ్లు.. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థుల ఖాతాల్లో నేరుగా వేసే లక్ష్యంతో డీబీటీ విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ, ఆ లక్ష్యాన్ని నేల మీద సజావుగా అమలు చేయడం అంత సు లభం కాదనే విషయం ఈ పరిణామాల్లో స్పష్టమవుతోంది. దీని కోసం భారీ స్థాయి లో నిధుల సమీకరణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోంది. లక్షలాది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేయాలంటే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుంది. బడ్జెట్ కేటాయింపులు సమయానికి అందకపోతే చెల్లింపుల్లో ఆలస్యం జరిగే ప్రమాదం ఉంది. దీనికితోడు ప్రభు త్వం డబ్బు విడుదల చేసినప్పటికీ, అది వి ద్యార్థుల ఖాతాల్లోకి చేరే వరకు ఉండే ప్రక్రియలో ఆలస్యం జరగకుండా పర్యవేక్షించ డం అవసరం.

ఒకసారి ఆలస్యం జరిగితే కా లేజీలు, విద్యార్థుల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం, బ్యాం కులు, విద్యాసంస్థలుఈ మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధమైన స్పష్టమైన కమ్యూనికేషన్ మెకానిజం లేకపోవడం గందరగోళానికి దారితీ స్తోంది. విద్యార్థుల అర్హత నిర్ధారణ, డేటా ధృవీకరణ, చెల్లింపుల ప్రాసెసిం గ్ ఇవి సమర్థవంతమైన డిజిటల్ వ్యవస్థ పై ఆధారపడి ఉంటాయి. ఇందులో లోపాలు ఉంటే చెల్లింపులు ఆలస్యం కావడం లేదా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఇక న్యాయపరమైన సవా ళ్లు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. హైకోర్టు జోక్యం, స్టే ఉత్తర్వులు పాలసీ అమలుపై ప్రభావం చూపుతున్నా యి. దీంతో ప్రభు త్వం తన నిర్ణయాలను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

అవగాహనలేక అపోహ పడుతున్నారు

జీవో నెంబర్ 7 ద్వారా ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించాలని చూస్తోంది. ఈ విధానం అమలు చేయడంలో భాగంగా విద్యార్థుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూల్ చేసే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయి. గతంలో మంచి ర్యాంకు వస్తే ఫీజు లేకపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను మూడు నాలుగేళ్ల తర్వాత విడుదల చేస్తున్నారు.

అప్పటికే చాలా మంది విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. ఈ విధంగా చాలా కాలేజీల్లో ఇప్పటికే స్కాలర్‌షిప్‌ల పేరిట కోట్లాది రూపాయలు విడుదలకాని నిధులున్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఇలాంటి సమస్యలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా డీబీటీ విధానంపై విద్యార్థులకు అవగాహన లేక అపోహ పడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే విధానంలో చాలా లోపాలున్నాయి. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని తప్పించుకునే ఎత్తుగడ ఇది. విద్యార్థులను మోసం చేసే కుట్ర. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 

 ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర..

జీవో నెంబర్ 7 పేరిట రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రకు పాల్పడుతుంది. విద్యార్థుల అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం వాస్తవానికి విద్యార్థులపై అదనపు భారం మోపడమే. ఈ నిర్ణయం వలన ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం. విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజును విద్యార్థులపై మోపడం అన్యాయం. ఇప్పటికే పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి చదువులు కొనసాగిస్తున్నారని,

అనేక మంది తమ సర్టిఫికెట్లను కూడా తీసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రైవేట్ కళాశాలలకు భరోసా కల్పిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే, కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపించి చేతులు దులుపుకోవడం వెనుక పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేయాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ దుర్మార్గమైన విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే, రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో విద్యార్థులను సమీకరించి, ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం.  

                                           బాలు, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఫీజుల పథకం ఎత్తివేసేందుకే..

ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఫీజులను చెల్లించకుండా, నగదు బదిలీ పేరుతో డైరెక్టుగా విద్యార్థుల అకౌంట్లలోకి స్కాలర్షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తామని నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల అకౌంట్లోకి నిధులు ఇవ్వడం మంచిదే అయినా దానికి నిర్ధిష్టంగా ఎప్పుడు చెల్లిస్తారో, ఎలా చెల్లిస్తారో, స్పష్టత లేదు. ఒక ప్రక్క ప్రైవేట్ కళాశాలలు కళాశాలలో చేరేటప్పుడు ఫీజులు చెల్లించాలని అంటుంటే, విద్యార్థులు కళాశాలలో చేరేనాటికి ఇవ్వకుంటే  వృత్తివిద్య ప్రధానంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, లా లాంటి ఉన్నత విద్యను పేద విద్యార్థులు దూరం అయ్యే ప్రమాదం ఉంది.

ఇది వరకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు  మాత్రమే అమలు చేస్తున్న ఆచరణలో వారికి సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. ఇప్పుడు హైకోర్టుకు ప్రభుత్వం గత ప్రభుత్వం బకాయిలతో మాకు సంబందం లేదని అఫిడవిట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఉన్న బకాయిలైనా విడుదల చేయాలి. అవి కూడా విడుదల చేయడం లేదు. కాంగ్రేస్ మేనిఫెస్టోలో మరింత పారదర్శకంగా ఉన్నతంగా అందిస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం పథకాన్ని ఎత్తివేసే చర్యలు సరైనవి కావు. డీబీటీ విధానాన్ని వెనక్కి తీసుకొని, పాత బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్ నష్ట పోకుండా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. 

 నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి

ఏమిటీ జీఓ నెం.7

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం జీ ఓ నం.7ను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా చెల్లింపు విధానాన్ని మార్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఇంతవరకు అమల్లో ఉన్న విధానానికి భిన్నంగా, కాలేజీలకు నేరుగా చెల్లింపులు చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం జమచేసిన మొత్తాన్ని వి ద్యార్థులే సంబంధిత కాలేజీలకు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ సమయం లో ఫీజుల కోసం విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తేవద్దని ప్రైవేట్ కాలేజీలకు ఆదేశించింది. రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చూ సుకోవాలని స్పష్టం చేసింది. కాలేజీలు వసూలు చేసే ఫీజులు టీఏఎఫ్‌ఆర్సీ నిర్ణయించిన పరిమితులకే కట్టుబడి ఉండాలని జీవోలో పేర్కొంది.

అదనపు ఫీజులు వసూలు చేయకుండా నియంత్రణ చర్యలు కొనసాగుతాయని తెలిపింది. విద్యార్థుల అర్హత నిర్ధారణ, టోకెన్ జారీ వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఫీజు రీయింబ ర్స్‌మెంట్ మొత్తాలు విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ కాలేజీలలో ఆందోళనకు కారణమైంది. చెల్లింపుల్లో ఆలస్యం, ఫీజు వసూళ్లలో అనిశ్చితి వంటి అంశాలు సమస్యగా మారే అవకాశముందని విద్యాసం స్థలు భావిస్తున్నాయి.