కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయం
కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడు గుడిపెల్లి మధుకర్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూలై 3: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన లక్ష్యమని జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుడిపెల్లి మధుకర్ రెడ్డి అన్నారు.శుక్రవారం అర్వపల్లి చౌరస్తాలో అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డీజే సౌండ్ల నడుమ ఘన స్వాగతం పలికారు.
గజమాలలు,శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అర్వపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అందరినీ కలుపుకొని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా కార్యదర్శి వేల్పుల రమేష్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో ఆర్డినేటర్ జీడీ వీరస్వామి,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య,సీనియర్ నాయకుడు దల్వాయి శ్రీధర్,సర్పంచ్లు చిల్లంచర్ల విద్యాసాగర్,లూనావత్ కృష్ణనాయక్,చెరుకు వెంకటమ్మ,ఉపసర్పంచ్ మామిడి శ్రీను,మాజీ జడ్పీటీసీ అవిలయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిని మనోహర్,లింగంపల్లి సైదులు,ఈద కోటి ప్రసాద్,విష్ణు,రామనర్సయ్య, రాహుల్,శివతోపాటు వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు,పలువురు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






