4 July, 2026 | 3:49 AM

బ్రహ్మశ్రీ రాజేశ్వర గుప్తకు అన్నపూర్ణ పురస్కారం

04-07-2026 01:49 AM

మేడ్చల్, జూలై 3 (విజయక్రాంతి): మేడ్చల్ అయ్యప్ప దేవస్థానం గురుస్వామి బ్రహ్మశ్రీ తాళ్లపల్లి రాజేశ్వర గురుస్వామికి అన్నపూర్ణ పురస్కారం లభించింది. ఆయన ప్రతి ఏటా చేస్తున్న అన్నదానము ఇతర సేవలను గుర్తించి మహా శాస్త్ర సేవా సంఘం ఆయనను అన్నపూర్ణ సేవ పురస్కారంకు ఎంపిక చేసినట్లు సంఘం ప్రకటించింది.

ఆగస్టు 22వ తేదీన నగరంలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజేశ్వర స్వామి  అయ్యప్ప భక్తులకు దేవాలయం తరఫున రెండు పూటలా అన్నదాన  కార్యక్రమాన్ని గత 44 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.