భూముల వ్యవహారంలో సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేయాలి
05-05-2026 12:55 AM
కొల్లాపూర్ టౌన్ , మే 4: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజ్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసంపూర్ భూముల వ్యవహారంలో తనకు సంబంధం లేదని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 1600 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారని తెలిపారు. రైతుల పంటలను ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేసి డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






