5 May, 2026 | 2:11 AM

చెరువు తూమును తెరవండి..!

05-05-2026 12:56 AM

సిద్దాపూర్ గ్రామస్తుల వినతి 

జుక్కల్, మే 4 (విజయక్రాంతి): జుక్కల్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన చెరువు తూమును తెరవాలని సోమవారం తహశీల్దార్ మారుతికి వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఒక వ్యక్తి తూముకు తన చేను దగ్గరగా ఉందని మూసివేశాడని అన్నారు.

ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. ఇరిగేషన్ అధికారులకు సమస్యను వివరించాలంటూ వినతిపత్రంలో తాసిల్దార్ కు వేడుకున్నారు. సామాన్యుల సమస్యలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

సంవత్సరం నుంచి చెరువు దిగువ బాగానే ఉన్నా పొలాల్లో నీరు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పండించుకోవాలంటే బోరు బావులే శరణమయ్యయని  పేర్కొన్నారు. బోరు బావులు లేని రైతులు ఏం చేయాలంటూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తమకు చెరువు తూమును తెరిపించి న్యాయం చేయాలని వారు కోరారు. దీనికి తాసిల్దార్ సానుకూలంగా స్పందించారని, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలియజేస్తానని చెప్పారు.