24 April, 2026 | 3:16 AM

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి

24-04-2026 01:42 AM

ముషీరాబాద్‌లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాం తి): ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్క రించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొ న్నారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో ‘కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తి స్తాం, సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారని, ప్రభు త్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ముఖ్యమంత్రి ఆ సమస్యల పరిష్కారా నికి ఎందుకు అడుగు ముందుకు వేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజ న్‌లోని మేడిబావి బస్తి అంగన్వాడీ కేంద్రాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమా జం, భవిష్యత్తు, విద్య యొక్క ఆవశ్యకతపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సికింద్రాబాద్ పార్లమెం ట్ పరిధిలో ని ప్రభుత్వ భవనాల్లో ఉన్న అన్ని అంగన్వాడీలను దశలవారీగా అప్గ్రేడ్ చేస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన బస్తీ దవాఖానలకు బడ్జెట్ కేటాయింపులు కేం ద్రం నుంచే జరుగుతున్నాయన్నారు. వాటి అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబా ద్ జిల్లా అధ్యక్షు డు భరత్ గౌడ్ ముషీరాబాద్ నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి రమేష్ రామ్, రాష్ట్ర నాయకుడు సలంద్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనుల్లో జాప్యం..

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ  నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ (భూసేకరణ) చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, దీనివల్ల నాలాల అభివృద్ధి, రోడ్ వైండింగ్ పనులు కుంటుపడుతున్నాయన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్‌ఎంసీకి బడ్జెట్ కేటాయింపులు పెంచి, నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.

అవినీతి కుంభకోణాలపై పీసీ ఘోస్ నివేదిక చెల్లదు..

అవినీతి కుంభకోణాలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమి టీ ఇచ్చిన నివేదిక చెల్లనేరదని, అది పూర్తి గా చట్ట విరుద్ధం. నారమ్స్ ప్రకారం ఆ కమిటీని కాన్‌స్టిట్యూట్ చేయలేదని, నార మ్స్ ప్రకారం దాని నివేదిక ఇవ్వలేదని చెప్పి  హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో... ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అదేవిధంగా రాహుల్ గాంధీకి చంపపెట్టు లాంటిదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం అం బర్‌పేట నియోజకవర్గంలోని నల్లకుం ట ఫీవర్ ఆసుపత్రిలో ఈసీజీ,  వైద్య పరికరాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనేక హామీలు ప్రజలకి ఇచ్చారన్నారు.