కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ఒకటే
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాలయాపన
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
ఇందూరు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ గోష్ కమిషన్ పేరుతో రెండేళ్లపాటు కాలయాపన చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావును, కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని ప్రకటిం చిందన్నారు. కానీ ఇప్పటి వాకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రాజె క్టు వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని స్వయంగా కాంగ్రెస్ ఆరోపించి, ఇప్పుడేమో కోర్టులో 9 వేల కోట్లు అవినీతి జరిగిందం టూ పిటిషన్ వేయడం వెనక ఆంతర్యం ఏ మిటో తెలపాలన్నారు.
అవినీతి పరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలు స్తోందన్నారు.అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో ప్ర భుత్వం విఫలమైందన్నారు.చిత్తశుద్ధి ఉంటే సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి లేఖ రాయాలన్నారు. అలాగే హైకోర్టు స్టే ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్ర భుత్వ బాధ్యత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు.
అర్బన్‌లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సీడీపీ ఫండ్ లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి అంటారు, కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు. అలాగే మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దారుణమన్నారు. ఫ్లోర్ లీడర్ ప్ర మోద్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మ ల్కాయి మహేం దర్,సీనియర్ నేతలు న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్, సత్యపాల్, పుట్ట వీరేందర్, మండల అధ్యక్షుడు పడాల భూపతి, పిల్లి శ్రీకాంత్, అమంద్ వి జయ్, మారావార్ కృష్ణ తదితరులున్నారు.






