తెలంగాణ సాంస్కృతిక వైభవం
చిదంబరం ఆణి తిరుమంజనోత్సవంలో ప్రత్యేక గుర్తింపు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఇటీవల చిదంబరంలోని చారిత్రాత్మక శ్రీ నటరాజ స్వామి దేవాలయంలో జరిగిన 10 రోజుల ఆణి తిరుమంజన మహోత్సవంలో తెలంగాణ కళాకారుల సాంస్కృతిక సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రో జుల ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 50 మందికి పైగా సంగీత విద్వాంసులు, నృత్య కళాకారులు, విద్యార్థులు, భక్తు లు సంగీతం, నృత్యం, సాహిత్యం ద్వారా న టరాజ స్వామికి భక్తి నివేదన చేశారు.
నటరాజ ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు ఎన్.డి. నటరాజ దీక్షితార్ ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో, ప్రముఖ మృదంగ విద్వాంసు లు పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వరరావు సమక్షంలో హైదరాబాద్కు చెందిన సాంస్కృతిక సేవకులు గోడి విజేత దేవి, గోడి సతీష్ రెడ్డి ఈ సాంస్కృతిక బృందానికి నాయకత్వం వ హించారు. ప్రఖ్యాత కూచిపూడి గురువు జ్యోతిరెడ్డి నేతృత్వంలోని జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతి పొలాకి నేతృత్వంలోని రాగ మ్యూజిక్ అకాడమీ ఈ కార్యక్ర మాల్లో విశేషంగా పాల్గొన్నాయి. రాగ మ్యూ జిక్ అకాడమీ అధ్యక్షులు పి. సూర్యనారాయ ణ రచించిన ‘భాసురి’ తెలుగు సంగీత గ్రం థం ఆవిష్కరణ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వరరావు నిర్వహించిన సంప్రదాయ మద్దెల పూజ, శివతాండవంతో శ్రీకారం చుట్టారు. 83 ఏళ్ల వయస్సులోనూ ఆయన ప్రదర్శించిన లయ విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చే శాయి. రాగ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకురాలు భారతి పొలాకి ఆధ్వర్యంలో జరిగిన కర్ణాటక సంగీత కచేరీ విశేష ఆదరణ పొం దింది. గీత (గాన సహకారం), కాళీ ప్రసాద్ (మృదంగం), సీతాపతి రావు (వయోలిన్) సహకారంతో జరిగిన ఈ కచేరీలో ‘వాతాపి గణపతిం’, ‘అమ్మ ఆనందదాయిని’, ‘శంభో మహాదేవ’ తదితర కీర్తనలు ఆలపించబడ్డా యి. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వరపరిచిన ‘అమ్మ ఆనందదాయిని’ కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తిరసాన్ని పంచిం ది.
దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంపై శ్రీ పి. సూర్యనారాయణ రచించిన ‘భాసురి’ గ్రం థాన్ని పద్మశ్రీ డా.ఎల్లా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. అదిత్రి, హర్షిత, తన్వి, తనుశ్రీ, యువశ్రీల ‘గణనాథాయ’, గోడి అ నఘాదేవి ‘పుష్పాంజలి’, తులసి రెడ్డి కోలన్ ‘శివస్తుతి’, దేవాంశ, మిధున, చిన్మయి, జశ్వి త, మన్విత, తారల ‘మండూక శబ్దం’ ప్రదర్శనలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. గోడి విజేత దేవి స్వయంగా నటరాజ స్వామి కి సమర్పించిన ‘చిదంబర నటం’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ నాట్య కార్యక్రమానికి జ్యోతి రెడ్డి (నట్టువాంగం), మంత శ్రీనివాస్ (గానం), ఎం. చంద్రకాంత్ (మృదంగం), మాస్టర్ మంత భరద్వాజ్ (వేణువు) సహకరించారు. కూచిపూడికి చేసిన సేవలకు గుర్తింపుగా గురుజ్యోతి రెడ్డిని పద్మ శ్రీ డా. ఎల్లా వెంకటేశ్వరరావు సన్మానించారు. జ్యోతి కళాక్షేత్రం, గోడి విజేత దేవి, గోడి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పాలగిరి వేదవ్యాస్ రెడ్డి, పాలగిరి వినయాదేవి, తుల సి రెడ్డి కోలన్ సహకారంతో పద్మశ్రీ డా. ఎల్లా వెంకటేశ్వరరావుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.






