26 June, 2026 | 1:01 AM

పుటం మంచిగ ఎల్లలే..

26-06-2026 12:00 AM

ఈ యేడు కూడా ఎదురుచూపులే..

ఇప్పటికైనా వర్షాలు కురిసేనా?

ఇప్పటికే నెలరోజుల కాలం అయిపోవస్తుంది

చెరువులు, కుంటలన్నీ ఖాళీ

సరిగా ఎదగని వరి సాగు 

సర్కారు విత్తనాలే ఇట్లుంటె ఎట్ల?

బోధన్, జూన్ 25 (విజయక్రాంతి): జిల్లా రైతులకు ప్రతిసారి ఖరీఫ్ సీజన్లో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ సంవత్సరం వర్షాలు ప్రారంభం కాకపోవడం, జిల్లా అధికారులు వర్షాలు పడకుండా వరినారు వేసు కోకూడదని సలహాలివ్వడంతో రైతులు పంటలు వేసుకోడానికి వెనకాముందవుతున్నారు.

2.25 లక్షల ఎకరాల్లో వరిపంట..

ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4,41,735 ఎకరాల్లో పంటలు పండిస్తారని నిజామాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా పండించే పంటల విస్తీర్ణంలో సగం అంటే సుమారు 2,25,540 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పంటను పండించనున్నారు. ఈ సీజన్లో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండి స్తారనేది అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా ఎరువులు, విత్తనాలు రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారు. వరి పంటతో పాటు ప్రధాన పంటలైన మొక్కజొన్న 48,750 ఎకరాలు, పసుపు 36 వేల ఎకరాల్లో పండిస్తారు.

చెరువులు, కుంటలన్నీ ఖాళీ

జిల్లాలో చెరువులు, కుంటలు వంటి సాగునీటి వనరుల్లో నీరులేక బోసిపోతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకో వడంతో రైతాంగానికి సాగునీరందని పరిస్థితి. ప్రభుత్వం రైతుల కోసం సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు రాయితీపై సప్లయ్ చేస్తున్నప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఆశించిన ప్రయోజనం అందడం లేదు. పోయినేడు ఈసారి కన్నా ముందే వర్షాలు పడినట్లు అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా ముందుగానే ఖరీఫ్ పనులు ప్రారంభించారని చెపుతున్నారు.

ఈసారి మాత్రం సీజన్ ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా వర్షాలు కురవక రైతులకు ఇబ్బం దులు తప్పడం లేదంటున్నారు. అలాగే రెక్కలు ముక్కలు చేసి ఎండనక, వాననకా కష్టపడి పంటలు పండించే రైతులపై ప్రభుత్వంతో పాటు ప్రకృతి కూడా కోపమే ఉన్నట్లుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పండిం చేటప్పుడు వర్షాల కోసం తపించాలి.. పంటలు పండాక గిట్టుబాటు ధర కోసం కొట్లాడాలి... మా బతుకంతా ఆశపడటం.. భంగపడటంతోనే సరి పోతుందని రైతులు ఆవేదనగా చెపుతున్నారు.

సరిగా ఎదగని వరి సాగు సర్కారు విత్తనాలే ఇట్లుంటె ఎట్ల?

బయట విత్తనాలు కొంటే నకిలీ ఉంటయేమోనని సొసైటీల తీసుకుంటే ఆ సంచులల్ల సగం తర్రలే ఎల్లినయి. మేం ఎప్పుడుకూడా పండించిన పంట నుంచే విత్తనాలు తీసి పొలంలో పోస్తుంటిమి. ఈసారి సొసైటీల తీసుకుని పోస్తే ఇట్లెల్లినయి. నారుమళ్లు పోస్తే పుటం కూడా సరిగా ఎల్లలే. దీని గురించి అధికారులు పట్టించుకోవాలె.

ఇప్పటికైనా వర్షాలు కురిసేనా?

ఇప్పటికే నెలరోజుల కాలం అయిపోవస్తుంది. ఇప్పుడైనా వర్షాలు పడితే ఖరీఫ్ సేద్యం ముందుకు సాగుతుంది. లేదంటే రైతులకు ఇబ్బందులు తప్ప కపోవచ్చని అంటున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం సంతృప్తికరంగా పడ్డప్పటికీ కొన్ని మండలాలకే అది పరిమితమైంది. జిల్లా అంతటా వర్షం కురవక వర్షం పడిన చోట రైతులు దుక్కులు దున్నుకునేందుకు సిద్ధమయ్యారు.

విత్తనాలల్లో సగం తర్రలు

ప్రభుత్వం సహకార సంఘాల ద్వారారైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాల సంచుల్లో సగం తర్రలే వస్తున్నాయని బోధన్ డివిజన్ రైతులు ఆరోపిస్తు న్నారు. అవసరానికి అనుగుణంగా విత్తనాలు తీసుకుంటే విత్తనాల్లో సగం వరకు తర్రలు రావడంతో మళ్లీ అదనంగా విత్తనాలు కొనుగోలు

- రఘుపతి సాయిలు, ఊటుపల్లి, రైతు బోధన్

విత్తనాలు సరిగా రాలే

ప్రభుత్వం ఇచ్చే సీడ్ సరిగా రాలేదు. వరినారు మడి పోస్తే పలుచగా వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు పోసినా చిక్కగా వస్తుండే. ఇప్పుడిట్లచ్చింది. అది నాది తప్పో విత్తనాల పొరపాటో గాని నారు మాత్రం పలుచగా వచ్చింది. మళ్లా ఇంకో సంచి తెచ్చిపోసినా పలుచగనే వచ్చింది.

- తడపు రవి, ఊటుపల్లి రైతు బోధన్