ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్
శంకర్ పల్లి జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ హెచ్చరిం చారు. గురువారం శంకర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి గదులను, రికార్డులను పరిశీలించారు.
ఆసుపత్రిలోని గదులను శుభ్రంగా ఉంచి రోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుప త్రి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం ఏ ర్పాటుచేసిన ప్రసవగది అపరిశుభ్రంగా ఉండడంతో.. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం తెలియదా అని మండిపడ్డారు. ఆ సుపత్రిలో ఉన్న రోగులకు అందుతున్న వైద్య చికిత్సల కోసం వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చి రోగులకు సేవలను అందించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని వైద్య,ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. కాగా వర్షాకాలం వచ్చినందున సీజన్ వ్యాధుల పట్ల అప్రపత్తంగా ఉండాలని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వం కూడా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అధునాతనమైన పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాపారావు, డిటిసిఓ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాస్, ఆరోగ్య కేంద్రం డాక్టర్ రేవతి రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.






