26 June, 2026 | 1:18 AM

కేటీఆర్ రాకతో కిక్కిరిసిన మొయినాబాద్

26-06-2026 12:07 AM

-ఘన స్వాగతం పలికిన బీఆర్‌ఎస్ నాయకులు

మొయినాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మొయినాబాద్ కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం, ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యలో మొయినాబాద్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో కేటీఆర్‌ను సత్కరించి పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా మొయినాబాద్ నుంచి చేవెళ్లకు బయలుదేరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొయినాబాద్ కేంద్రం గులాబీ జెండాలతో కళకళలాడగా, కార్యకర్తల నినాదాలతో ప్రాంతం మారుమోగింది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.