రాజ్యాంగానికి కేంద్రం తూట్లు
ప్రభుత్వ సలహాదారు వీహెచ్
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని ప్రభుత్వ సలహాదా రు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్‌ను, రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోందన్నారు.
ప్రధానప్రతిపక్ష నేత అంటే ప్రధాని నరేంద్ర మోదీ రబ్బర్ స్టాంప్‌గా భా విస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి సంప్రదాయం కాదని వీహెచ్ హితవు పలికారు. సీబీఐ డైరెక్టర్ అపాయింట్ విషయం లో అపోజిషన్ లీడర్ అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహారించాల్సి ఉంటుందని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం వాటిని బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.






