14 May, 2026 | 2:03 AM

వన్యప్రాణుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం

14-05-2026 01:02 AM

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి) : వన్యప్రాణుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అడవుల్లో నివసించే గిరిజనుల భాగస్వామ్యంతో ఎకో టూరిజం, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను నామినేషన్ విధానంలో చేపట్టాలన్నారు.

బుధవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (టీసీఎఫ్) పాల క మండలి సమావేశం జరిగింది. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల కోసం 2026-- 27 వార్షిక కార్యాచరణ ప్రణాళికకు టీసీఎఫ్ ఆమోదం తెలిపింది. మంత్రి మాట్లాడుతూ రిజర్వ్ అడవుల భద్రతకు వాచర్ల వేతనాలు, అడవుల్లో మౌ లిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.