22 May, 2026 | 5:35 AM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..

07-02-2026 12:57 AM

దేశంకోసం ధర్మంకోసం బీజేపీని గెలిపించండి..

21వ డివిజన్ అభ్యర్థి గూండా సంతోష్  

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం అని, మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించి  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం  బిజెపి  కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరం మద్దతు పలకాలని  21వ డివిజన్ కార్పొరేటర్ బిజెపి అభ్యర్థి గూండా సంతోష్ అన్నారు. కేంద్రంలో బిజెపి  అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందుతున్నాయని పేర్కొన్నారు.

దేశం కోసం ధర్మం కోసం బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సహకారంతో  తన డివిజన్ ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని సంతోష్ తెలిపారు. మహబూబ్నగర్ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయన్నారు.  యూనివర్సిటీ కి రూ 100 కోట్లు, ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విద్యాలయం లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నిధులతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.