2 May, 2026 | 3:46 AM

టీజీ20 లీగ్‌ను తక్షణమే ఆపించండి

02-05-2026 02:32 AM

బీసీసీఐకి టీసీఏ ఫిర్యాదు

బాంబే హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదు

హైదరాబాద్, మే 1 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించబోతున్న టీజీ 20 లీగ్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ బీసీసీ ఐకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. నిబం ధనలకు విరుద్ధంగా బీసీసీఐ రా జ్యాంగం నియమాలు పాటించకుండా ఈ లీగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

ఇదే విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళుతూ టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి టీసీఏతో కలిసి పనిచే యాలని బాంబే హైకోర్టు ఆదేశాలను సైతం హెచ్‌సీఏ బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. ఏదైనా స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ రాతపూర్వక అ నుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ సూచనలు, సలహాలు కూడా తీసుకుని యువ క్రికెటర్లకు మంచి జరిగేలా చూడాలన్న కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

బీసీసీఐ రాజ్యంగానికి విరుద్ధంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర అధికారులు తర్వాత కెరీర్ పరం గా ఎదురయ్యే పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని టీసీఏ హెచ్చరించింది. వారి పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పే ర్కొంది. గత కొన్నేళ్లుగా అ వినీతి ఆరోపణలు, కోర్టు కేసు లతో భ్రష్టపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇ ప్పు డు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల క్రికెటర్ల కెరీర్‌తో ఆడుకుంటోందని టీసీఏ ఆగ్ర హం వ్యక్తం చేసింది.

ఎటువంటి రాతపూర్వక ఆ మోదాలు లేకుండా గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి టీజీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీనిపై బీసీసీఐ వెంటనే జోక్యం చేసుకుని టీజీ20 లీగ్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఈ లీగ్ నిర్వహణ కోసం టీసీఏ సలహాలు, సూచనలు తీసుకుని పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లకు అత్యధిక ప్రాధాన్యత దక్కేలా చూడాలని కోరింది. బీసీసీఐ జోక్యం చేసుకోకుంటే తెలంగాణ క్రికెట్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంది.