18 April, 2026 | 3:01 AM

రాష్ట్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

18-04-2026 01:29 AM

ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులతో కలిసి వినతి పత్రం అందజేసిన తాసీల్దార్ కృష్ణయ్య

చేవెళ్ల ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రెవెన్యూ ఇతరాత్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేవెళ్ళ తాహాసిల్దార్ ఆర్ కృష్ణయ్య ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఉద్యోగులతో కలిసి శుక్రవారం స్థానిక ఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7న జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించడానికి చర్చలు జరిపారు.

ఈ క్రమంలో చేవెళ్ళ ఆర్డీవోకు నాలుగు ప్రధాన సమస్యలు 1. పిఆర్ సి 2. పెండింగ్ బిల్లులు 3. ఆరోగ్య కార్డులు 4. సీపీఎస్ 5. ఇతర (63) ప్రధాన డిమాండ్లుపై ప్రధాన సమస్యలతో పాటు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, పెండింగ్ కంపస్సిఒనెట్ అప్పోయింట్మెంట్స్, రెగ్యులర్ అయిన విఆర్‌ఏల సర్వీస్, 61 సంవత్సరాలు దాటిన విఆర్‌ఏల వారసులకు ఉద్యోగ నియామకాలు,

ఇంతకుముందున్న వీఆర్ రోల సర్వీస్ తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మే 5న అన్ని జిల్లా కేంద్రాల్లో వన్డే నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే జేఏసీ తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని పేర్కొన్నారు.