దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం (అమీన్పూర్), జూలై 5: దేవాలయాలు ఆధ్యాత్మికతకు, భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు నిలయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం బొల్లారం డివిజన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి ఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






