21 June, 2026 | 5:11 AM

జాతీయ లోక్‌అదాలత్‌ను సందర్శించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

21-06-2026 12:00 AM

పాల్గొన్న ఇంచార్జ్  సెషన్స్ జడ్జి జె. విక్రమ్

సికింద్రాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి):జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సె షన్స్ డివిజన్, నాంపల్లి, హైదరాబాద్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ఘనంగా ని ర్వహించారు.కార్యక్రమాన్ని  ఇన్చార్జ్ సెషన్స్ జడ్జి జె. విక్రమ్ ప్రారంభించారు.జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా  తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి మరియు తెలంగాణ రా ష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్  జస్టిస్ సామ్ కోషి , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి  చి. పంచాక్షరి గారితో కలిసి నాంపల్లి కోర్టును సందర్శించారు.

ఈ  సందర్భంగా వివిధ లోక్ అదాలత్ బెంచీలను పరిశీలించి, రాజీ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. న్యాయమూ ర్తులు, న్యాయవాదులు, కక్షిదారులతో మా ట్లాడి లోక్ అదాలత్ ద్వారా కేసులుపరిష్కారమ వుతున్న తీరును తెలుసుకున్నారు.రాజీ ద్వారా పరిష్కారమైన కేసుల కక్షిదారులకు లోక్ అదాలత్ అవార్డులను స్వయంగా అం దజేసి అభినందించారు. ప్రజలకు త్వరి త, సులభ, తక్కువ ఖర్చుతో న్యాయం అం దించడంలో లోక్ అదాలత్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.

వివాదాలను రా జీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా కావడంతో పాటు కు టుంబ, సామాజిక సామరస్యం నెలకొంటుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రాజీయోగ్యమైన కేసును లోక్ అదాలత్కు రిఫర్ చేయాలని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖలు, పోలీసు అధికారులు సమన్వయం తో కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంచార్జీ  సెషన్స్ జడ్జి జె. విక్రమ్  మాట్లాడుతూ లోక్ అదాలత్ ప్రజలకు త్వరిత, సులభ, తక్కువ ఖర్చుతో కూడిన న్యాయాన్ని అందించే సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కా ర వేదిక అని పేర్కొన్నారు.

కోర్టుల్లో పెం డింగ్లో ఉన్న కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం ఆదా కావ డంతో పాటు కోర్టులపై పెండింగ్ భారం తగ్గుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ జాతీయ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసు లు, బ్యాంకు రికవరీ కేసులు, కుటుంబ వివాదాలు,

కార్మిక వివాదాలు, క్రిమినల్ కాం పౌండబుల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీకి అనుకూలమైన కేసులను విచారణకు తీసుకొని పరిష్కరించే చర్య లు చేపట్టారు.జిల్లా న్యాయ సేవాధికార సం స్థ, సెషన్స్ డివిజన్, హైదరాబాద్ కార్యదర్శి పి. అరుణ కుమారి  ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏసీపీఎం. శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎ.రామ్ రెడ్డి ,బార్ అసోసియేషన్ అధ్యక్షులుబాలరాజు , న్యాయ మూర్తులు, బెంచ్ సభ్యులు, న్యాయవాదు లు, పోలీసు అధికారులు, జిల్లా న్యాయ సే వాధికార సంస్థ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కక్షిదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.