విద్యాభివృద్ధితోనే తెలంగాణ భవిష్యత్తు
మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్
హుజూర్ నగర్, మే 13: తెలంగాణ సమాజం సుందరంగా నిర్మించడంలో సర్పంచులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు అన్నారు. బుధవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నూతన సర్పంచులకు,వార్డు కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా విద్యారంగాన్ని సమూలంగా మార్చాలన్న ఆశయంతో ఈ విద్యా సంవత్సరం నుంచి 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల లో సౌకర్యాలు కల్పించడంలోనూ, విద్యార్థులను బడిలో చేర్పించడంలోనూ సర్పంచులు ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తయారు చేయాలని వారు పిలుపునిచ్చారు.
తదుపరి హుజూర్ నగర్ మండల విద్యాధికారి సైదా నాయక్ అధ్యక్షత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాబోయే నెల రోజులపాటు సాగనున్న బడిబాట కార్యక్రమం ద్వారా బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ ముఖ్,జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గుండు రామాంజిగౌడ్, మండల విద్యాధికారులు భూక్య సైదా నాయక్,ఛత్రు నాయక్, వెంకటాచారి, కాటయ్య, బాలు నాయక్, శ్రీనివాసరావు, ఫాతిమా, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, పాల్గొన్నారు.






