14 May, 2026 | 2:20 AM

అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి

14-05-2026 01:36 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, మే 13 : యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అండర్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాకే సిసి రోడ్లు వేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశించారు.

బుధవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డులలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్నింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి, కరెంటు లో వోల్టేజ్ వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి, అనంతరం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, సాధునేని ధనలక్ష్మి మధుకర్, బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, బూడిద మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బందారపు బిక్షపతి గౌడ్, డాక్టర్ గిరిధర్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.