14 May, 2026 | 2:48 AM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి

14-05-2026 01:33 AM

పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి, ఏప్రిల్ 13 : ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రజాప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి 17 వరకు జరుగుతున్న విద్యా వారోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నియోజకవర్గ సర్పంచ్ల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

సర్పంచులు విధిగా పాఠశాలలను సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు రాత పుస్తకాలు పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్, 24 వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న జిల్లా సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ సూర్యనారాయణ పలు మండల విద్యాధికారు బోయిని లింగయ్య, శాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.